పహల్గామ్ ఉగ్రదాడిలో వెలుగులోకి సంచలన విషయాలు.. పాకిస్తాన్ స్పష్టమైన పాత్ర

by Malleboina Mahesh |   (  Updated:2025-04-29 06:48:47  IST  )

జమ్మూ, కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 28 మందిని దారుణంగా హత్య చేశారు. కాగా ఈ ఉగ్రదాడి కేసుపై భారత దర్యాప్తు సంస్థలు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పహల్గామ్ ఉగ్రదాడిలో వెలుగులోకి సంచలన విషయాలు.. పాకిస్తాన్ స్పష్టమైన పాత్ర
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ, కశ్మీర్ లోని పహల్గామ్(Pahalgam)లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 28 మందిని దారుణంగా హత్య చేశారు. కాగా ఈ ఉగ్రదాడి కేసు (Terrorist attack case)పై భారత దర్యాప్తు సంస్థలు (Indian investigative agencies) విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఈ ఉగ్రదాడికి నాయకత్వం వహించిన హషీమ్ మూసా (Hashim Musa)ను పాకిస్తాన్ ఆర్మీలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)కు చెందిన మాజీ పారా కమాండో అని భారత దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. SSG అనేది పాకిస్తాన్ సైన్యం (Pakistan Army)లో అత్యంత శిక్షణ పొందిన యూనిట్, ఇది సాంప్రదాయేతర యుద్ధం, రహస్య కార్యకలాపాలు, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో నైపుణ్యం కలిగి ఉంటుంది. మూసా ప్రస్తుతం పాకిస్తాన్ ఆధారిత లష్కర్-ఎ-తొయిబా (LeT)తో కలిసి పనిచేస్తున్న హార్డ్‌కోర్ ఉగ్రవాదిగా గుర్తించబడ్డాడు.

మూసా SSG నుండి LeT కు వెళ్లాడు. ఇది పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాన్ని సూచిస్తుందని దర్యాప్తు సంస్థల అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పాక్ ఆర్మీలోని SSG కమాండోలు అత్యంత కఠినమైన శిక్షణ పొందుతారు. ఇందులో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, అధునాతన ఆయుధాల నిర్వహణ, హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్, నావిగేషన్, సర్వైవల్ స్కిల్స్ ఉంటాయి. మూసా (Hashim Musa) ఈ శిక్షణతో పహల్గామ్ దాడి (Pahalgam attack) వంటి సంక్లిష్ట ఆపరేషన్లను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉన్నాడు. హషీమ్ మూసానే పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించబడ్డాడు. దర్యాప్తులో 15 మంది కాశ్మీరీ ఓవర్‌గ్రౌండ్ వర్కర్ల (OGWs)ని ప్రశ్నించినప్పుడు, మూసా లాజిస్టిక్స్, రెక్కీలో స్థానికుల సహాయంతో దాడిని ప్లాన్ చేసినట్లు తెలిసింది. మూసా గత ఏడాది కాలంలో జమ్ము కాశ్మీర్‌లో ఉన్నాడని, గతంలో రెండు ఇతర ఉగ్రదాడుల్లో కూడా పాల్గొన్నాడని అధికారులు తెలిపారు.

Next Story