ఢిల్లీ పేలుడు కేసులో నిందితుడు షకీల్‌ విచారణలో సంచలన వివరాలు

by Malleboina Mahesh |

ఢిల్లీ పేలుడు కుట్ర కేసులో ప్రధాన నిందితుడైన ముజమ్మిల్‌ షకీల్‌ విచారణలో పోలీసులకు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది.

ఢిల్లీ పేలుడు కేసులో నిందితుడు షకీల్‌ విచారణలో సంచలన వివరాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ పేలుడు కుట్ర కేసులో ప్రధాన నిందితుడైన ముజమ్మిల్‌ షకీల్‌ (Accused Muzammil Shakeel) విచారణలో పోలీసులకు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారం.. గత రెండేళ్లుగా దేశ రాజధానిలో పేలుళ్లు జరపడానికి సిద్ధమవుతున్నట్లు నిందితులు ఎన్ఐఏ విచారణలో ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్‌, NPK ఫర్టిలైజర్‌ వంటి పేలుడు పదార్థాల తయారికి ఉపయోగించే రసాయనాలను భారీగా నిల్వ చేసేందుకు డీప్‌ ఫ్రీజర్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించారు. కుట్ర అమలు కోసం నిందితులంతా కలిసి రూ. 26 లక్షలు సమకూర్చుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. పేలుడు సిద్ధీకరణలో భాగంగా పనిచేసిన మరో నిందితుడు ఉమర్‌ ఢిల్లీ పేలుడులో మరణించగా, మిగతా నిందితులు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తుతో కేసు మరింత కీలక దశకు చేరినట్లు తెలుస్తుంది.

Next Story