- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assam : అస్సాం సంచలన నిర్ణయం
అస్సాం ప్రభుత్వం(Assam Govt) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : అస్సాం ప్రభుత్వం(Assam Govt) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజలకు ఆయుధాల లైసెన్సులు జారీ చేస్తున్నట్టు సీఎం హిమంత బిశ్వ శర్మ(CM Himanta Biswa Sarma) కీలక ప్రకటన జారీ చేశారు. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాల్లో అలాగే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాల్లో నివసించే స్థానిక, ఆదివాసీ ప్రజలకు భద్రత కోసం ఆయుధ లైసెన్సులు(Weapons Licenses) ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం(Cabinet Decision) తీసుకున్నట్టు పేర్కొన్నారు. గౌహతి(Guwahati)లోని లోక్ సేవా భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత శర్మ మాట్లాడుతూ.. నాగావ్‌లోని ఢింగ్, రూపోహి, దక్షిణ సల్మారా, గౌహతిలోని హాటిగావ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ లైసెన్సులు ఇస్తామని చెప్పారు.
ఈ ప్రాంతాలను ప్రభుత్వమే గుర్తిస్తుందని, దరఖాస్తుదారులు నేర చరిత్ర లేకుండా ఉండాలని షరతు విధించారు. అస్సాం అల్లర్లు(1971-85) సమయం నుంచి స్థానికులు ఈ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్న సీఎం.. ప్రజల డిమాండ్ నెరవేర్చడమే కాక, వారి భూములను కాపాడుకోవడానికి, జాతి, సంస్కృతిని రక్షించుకోవడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు.






