- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sanjay Roy : సంజయ్ రాయ్ తల్లి సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా ట్రైనీ డాక్టర్(Colcutta Trainy Doctor) పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(Sanjay Roy) ని కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా ట్రైనీ డాక్టర్(Colcutta Trainy Doctor) పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(Sanjay Roy) ని కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. కాగా కోర్టు తీర్పుపై సంజయ్ రాయ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తన కొడుకును ఉరి తీసినా తనకు అభ్యంతరం లేదని, సంజయ్ చేసిన తప్పును క్షమించరానిదిగా పేర్కొన్నారు. తనకూ ఆడపిల్లలు ఉన్నారని, మృతురాలి తల్లి బాధను తాను అర్థం చేసుకోగలను అని అన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయబోమని సంజయ్ కుటుంబ సభ్యులు పేర్కొనడం గమనార్హం. కాగా గత ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ(RG Kar Medical College)లో ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ని కోల్‌కతా సీల్దా కోర్ట్ దోషిగా తేల్చింది. సోమవారం నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది.






