- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbhmela:తొక్కిసలాట ఘటనకు అసలు కారణమిదే.. ప్రత్యక్ష సాక్షి సంచలన వ్యాఖ్యలు(వీడియో)
మహాకుంభమేళా(Maha Kumbhmela)లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: మహాకుంభమేళా(Maha Kumbhmela)లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తర ప్రదేశ్(Uttar Pradessh)లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఎంతో ప్రత్యేకత కలిగిన మౌని అమావాస్య కారణంగా అధిక సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రజెంట్ వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా వస్తారని, త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని కుంభమేళా DIG వైభవ్ కృష్ణ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలోనే అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఘాట్‌ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని హెచ్చరించారు. ఈ మాటలు వినకపోవడం, రద్దీ ఊహించని విధంగా పెరగడంతో ఘటన జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తొక్కిసలాట ఘటన సమయంలో అక్కడే ఉన్న కొంతమంది కీలక విషయాలు వెల్లడించారు. ఈక్రమంలో ఓ ప్రత్యక్ష సాక్షి ఘటనకు సంబంధించిన వివరాలు చెబుతున్నారు. ఆమె(ప్రత్యక్ష సాక్షి) మాట్లాడుతూ.. మౌని అమావాస్య కావడంతో భక్తులు(Devotees) పెద్ద ఎత్తున కుంభమేళాకు వచ్చారని చెప్పారు. అర్ధరాత్రి(Midnight) బ్రహ్మ ముహూర్తం నుంచే స్నానాలు చేసేందుకు ఘాట్ వద్దకు ప్రజలు రావడంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ ఎక్కువైందని తెలిపారు.
ఈ క్రమంలో ప్రజలు అందరూ కలిసి వెళ్తున్నారే తప్ప ఎటువైపు వెళ్ళాలనే దానిపై ఎవరికీ అవగాహన లేదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం(Government) ఘాట్లకు దగ్గరలో అనేక చెత్త డబ్బాలను ఏర్పాటు చేసిందని.. అర్ధరాత్రి కావడంతో ముందున్న చెత్త డబ్బాలు కనిపించక పలువురు భక్తులు వాటికి తగిలి కిందపడి పడిపోయారని పేర్కొన్నారు. అది గమనించని వెనుక ఉన్న వాళ్లు వారి మీద పడడం.. అప్పటికే అందరి చేతులు, తలలపై పెద్ద పెద్ద లగేజ్ బ్యాగులు ఉండడంతో ఇవన్నీ వారి మీద పడ్డాయని తెలిపారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.






