- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీజేఐపై దాడి చేసిన లాయర్ రాకేష్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న లాయర్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గావయ్ (Chief Justice BR Gavai)పై దాడి చేసేందుకు (Attempt to attack) యత్నించాడు.

దిశ, వెబ్ డెస్క్: ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న లాయర్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గావయ్ (Chief Justice BR Gavai)పై దాడి చేసేందుకు (Attempt to attack) యత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు చూడగా.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అతడు సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్ట బోమని బిగ్గరగా కోర్టు హాలులోనే నినాదాలు చేశారు. ఈ దాడి ప్రయత్నం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సీజేఐ పై దాడికి ప్రయత్నించిన లాయర్ రాకేష్ కిశోర్ (Lawyer Rakesh Kishore) ను నిన్న పోలీసులు అరెస్టు చేశారు.
కానీ లాయర్ పై దాడి యత్నానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో మూడు గంటల తర్వాత విడుదల చేశారు. సీజేఐపై దాడికి యత్నించినందుకు 71 ఏళ్ల లాయర్ (A 71-year-old lawyer)ను బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ (suspend) కూడా చేశారు. సీజేఐపై వస్తువు విసరడానికి ప్రయత్నించిన న్యాయవాది రాకేష్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు “సీజేఐ వంటి ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ‘మైలార్డ్’ అనే పదం యొక్క గౌరవాన్ని అర్థం చేసుకోవాలి. దానికి తగిన గౌరవం ఇవ్వాలి” అని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చేపట్టిన బుల్డోజర్ చర్య తప్పా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీజేఐ తీరుతో “నేను బాధపడ్డాను, ఆ బాధ కొనసాగుతుంది. అందుకే ఇలా చేశాను.. అని రాకేష్ కిశోర్ చెప్పుకొచ్చారు.






