తమిళనాడు పాలిటిక్స్‌లో సెన్సేషన్.. టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్‌

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-05 08:20:31  IST  )

తమిళనాడు (Tamilnadu) రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్, ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్‌ను అధికారికంగా ప్రకటించింది.

తమిళనాడు పాలిటిక్స్‌లో సెన్సేషన్.. టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్, ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఉపాధ్యక్షుడు బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ.. తమ నాయకుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని అన్నారు. ఆయన నేతృత్వంలోనే టీవీకే పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్.ఆనంద్, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. కాగా విజయ్ గతేడాది ఫిబ్రవరిలో టీవీకే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2026 ఎన్నికల్లో అన్ని 234 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా టీవీకే బలమైన శక్తిగా ఎదగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story