బిహార్ ఎన్నికల్లో సంచలనం.. సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ వెనుకంజ

by Kema Shiva Kumar |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకెళ్తోంది.

బిహార్ ఎన్నికల్లో సంచలనం.. సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ వెనుకంజ
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకెళ్తోంది. 190 స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులు స్పష్టమైన అధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 49 స్థానాల్లో మహగఠ్‌బంధన్, ఇతరులు 4 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. ఇక విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ అనూహ్యంగా వెనుకబడ్డారు. మూడో రౌండ్ ముగిసేసరికి రాఘోపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సామ్రాట్ చౌదరీ 1,273 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా తేజస్వీ యాదవ్ సోదరుడు, రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఎల్‌జేపీ (రాంవిలాస్‌) పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జానపద గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్‌ అలీనగర్‌ నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిసారి ఆమె ఎన్నికల బరిలో నిలవడం విశేషం.

Next Story