- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
23 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆజాంఖాన్
సమాజ్‌వాది పార్టీ(Samajwadi Party) సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్(Azam Khan) విడుదల అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: సమాజ్‌వాది పార్టీ(Samajwadi Party) సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్(Azam Khan) విడుదల అయ్యారు. 23 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జైలు నుంచి మంగళవారం రిలీజ్ అయ్యారు. దీంతో ఆయనకు జైలు బయట సమాజ్‌వాది పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అయితే.. నిజానికి ఆయన ఉదయం 9 గంటలకే ఆయన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ లీగల్ ప్రక్రియ కారణంగా కాస్త ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు ఆయన బయటకు రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 80కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆజంఖాన్ దాదాపు 23 నెలలపాటు జైల్లో ఉన్నారు. గత ఏడాది మే నెలలో ఆయనకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆజంఖాన్‌కు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలిక భద్రతను కల్పించింది. క్వాలిటీ బార్ భూఆక్రమణ కేసు(Land Encroachment Case)లో ఆజంఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జస్వంత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎన్నికయ్యారు.






