సీనియర్‌ ఐపీఎస్‌ పూరన్‌ కుమార్‌ కేసు.. హర్యానా DGPపై ప్రభుత్వం చర్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 08:41:24  IST  )

సీనియర్ ఐఏఎస్ పూరన్ కుమార్ (IAS Puran Kumar) ఆత్మహత్య వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

సీనియర్‌ ఐపీఎస్‌ పూరన్‌ కుమార్‌ కేసు.. హర్యానా DGPపై ప్రభుత్వం చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఐపీఎస్ పూరన్ కుమార్ (IPS Puran Kumar) ఆత్మహత్య వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఆయన సూసైడ్‌కు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షలు, బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు హర్యానా డీజీపీ (Director General of Police) శత్రుజీత్ కపూర్‌ (Shatrujeet Kapoor)ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపింది. అయితే, రోహ్తక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేంద్ర బిజార్నియా (Narendra Bijarnia)‌ను బదిలీ చేసిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. డీజీపీ సెలవుపై వెళ్లిన విషయాన్ని హర్యానా సీఎం మీడియా సలహాదారు రాజీవ్ జైట్లీ (Rajiv Jaitley) కూడా ధృవీకరించారు.

కాగా, పూరన్ కుమార్ ఆత్యహత్యకు ముందు మొత్తం 8 పేజీల సూసైడ్ నోట్‌ను వదిలి వెళ్లారు. ఆ లేఖలో డీజీపీ శత్రుజీత్ కపూర్, ఎస్పీ నరేంద్ర బిజార్నియాతో సహా ఎనిమిది సీనియర్ ఐపీఎస్ అధికారులు తనను కులం పేరుతో దూషించారని, మానసిక వేధించారని, అధికార దుర్వినియోగం చేస్తూ తనపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఇక పూరన్ కుమార్ భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ పూరన్ కుమార్ (Amneet Puran Kumar) తన భర్త ఆత్మహత్యకు కారణమైన వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.

Next Story