తీవ్ర ఉత్కంఠకు తెర.. కర్నాటక నెక్ట్స్ సీఎంగా సిద్ధరామయ్య

by Disha Web Desk 19 |
తీవ్ర ఉత్కంఠకు తెర.. కర్నాటక నెక్ట్స్ సీఎంగా సిద్ధరామయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ నాట నెలకొన్న తీవ్ర రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. సీఎం సీటు కోసం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీ పడటంతో.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్జే బుధవారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపి సీఎం పదవిపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించారు. కర్నాటక నెక్స్ట్ సీఎంగా సీనియర్ నేత, అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యకు అవకాశం కల్పించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కర్నాటకకు రెండవసారి సీఎంగా ఎన్నికైన సిద్ధరామయ్య ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి తీవ్ర కృషి చేసిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు సమాచారం.



Next Story

Most Viewed