లేటు వయసులో నీట్ క్లియర్.. మెడికోలుగా జాయిన్ కానున్న సీనియర్ సిటిజన్స్

by Ajay Maddhiboyina |

రకరకాల బ్యాగ్రౌండ్లతోని నీట్ ఎగ్జాం క్లియర్ చేసిన వారి కథనాలు మీడియాలో చదివాం చూసాం.. కానీ తమిళనాడులో ముగ్గురు లేటు వయసు విద్యార్థుల స్టోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

లేటు వయసులో నీట్ క్లియర్.. మెడికోలుగా జాయిన్ కానున్న సీనియర్ సిటిజన్స్
X

దిశ తెలంగాణ బ్యూరో: రకరకాల బ్యాగ్రౌండ్లతోని నీట్ ఎగ్జాం క్లియర్ చేసిన వారి కథనాలు మీడియాలో చదివాం చూసాం.. కానీ తమిళనాడులో ముగ్గురు లేటు వయసు విద్యార్థుల స్టోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య జరిగిన నీట్ ఎగ్జాం లో తమిళనాడుకు చెందిన 60, 67, 68 వయసున్న ముగ్గురు సీనియర్ సిటిజన్లు ర్యాంకులు సాధించి సీట్ కోసం ప్లాన్ చేస్తున్నారంట. ఇందులో ఇద్దరు గతంలోనే ప్రొఫెషనల్ లాయర్స్ కావడం విశేషం. దీంతో వారి వివరాలు ఈ మధ్యే కౌన్సిలింగ్ సంబంధిత పత్రాల్లో చూసిన అధికారులు అవాక్కయ్యారు. తమిళనాడులో అమలవుతున్న స్పెషల్ కోట ప్రకారం 7.5% సీట్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది కోటాలో వీరు అప్లై చేసినట్లు తెలుస్తోంది. సహజంగానే ఎంబిబిఎస్ ఇతర వైద్య కోర్సులకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మధ్య 35 సంవత్సరాలు దాటి నీట్ క్లియర్ చేసిన వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు అంటున్నారు. ఇలాంటివారు దాదాపు 25 మంది వరకు ఉన్నట్టు సమాచారం. వైద్య రంగానికి అనుబంధంగా ఉండే ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఇతర పారామెడికల్ కోర్సులను పూర్తిచేసి గతంలోనే అనుభవం ఉన్నవారు సైతం డాక్టర్లుగా మారడానికి కష్టపడి మరి నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయడం ఈ కోర్సులకు ఉన్న డిమాండ్ ను తెలియజేస్తోంది.

జాయినింగ్ సరే.. కంప్లీట్ చేస్తారా?

ఇప్పుడు చర్చంతా దీని గురించే.. నిజానికి మెడికల్ కోర్సులు పూర్తి చేయడానికి తీవ్రమైన శ్రమ, సమయాన్ని కేటాయించి అటు థియరీ ఇటు ప్రాక్టికల్స్ చేసే ఓపిక ఉండాలి. ఈ వయసులో జాయిన్ అవుతున్న వారు గంటల తరబడి ప్రాక్టికల్స్ చేయగలరా.. ఒకవేళ కోర్సు చివరి వరకు వెళ్లినా ఇంటర్న్ షిప్ సమయంలో తీవ్రమైన పని ఒత్తిడిని తట్టుకోగలరా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తమ కంటే చిన్న వారితో పోటీ పడలేకపోయినా, తమకంటూ గాఢంగా ఉన్న డాక్టర్ కావాలనే కోరికని ఈ వయసులో అయినా సాధించడం గ్రేట్ అని మరికొందరి అభిప్రాయం. ఈ పరీక్షకి వయసు పరిమితి లేకపోవడంతో క్రమంగా ఇతర ప్రొఫెషనల్స్ సైతం తమ సామర్థ్యానికి కొలమానంగా నిలిచే దీనిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story