- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ కూతుర్ని పంపించు.. మహిళా ఖైదీతో ఏఎస్ఐ నీచపు బేరం
మహారాష్ట్రలో దారుణం.. రూ. 80 లక్షల కేసులో అరెస్టైన మహిళా ఖైదీ కూతురిని పంపాలంటూ బేరమాడిన ఏఎస్ఐ రాజేష్ జాదవ్ సస్పెన్షన్. పూర్తి వివరాలు ఇక్కడ..

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో నేరాలు అరికట్టి న్యాయాన్ని నిలబెట్టాల్సిన ఓ పోలీసు నీచ బుద్ధిని ప్రదర్శించాడు. యావత్ సభ్యసమాజమే తలదించుకునేలా మహిళా ఖైదీపట్ల తన పాటు బుద్ధిని ప్రదర్శించాడు. మహారాష్ట్రలోని (Maharashtra) అకోలా (Akola) పోలీస్ స్టేషన్‍లో ఈ ఘటన జరిగింది. దాదాపు రూ. 80 లక్షల ఆర్థిక మోసం కేసులో ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరంఆమెను సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉంచారు. మంగళవారం విధుల్లో ఉన్న ఏఎస్ఐ రాజేష్ జాదవ్ ఆ మహిళా ఖైదీ వద్దకు వెళ్లి నీచంగా వ్యవహరించాడు. అంతటితో ఆగకుండా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ కూతురు కూడా కచ్చితంగా అందంగానే ఉంటుంది. నీ కుతుర్ని నా దగ్గరికి పంపించు, అందుకు బదులుగా నీకు రూ.10,000 ఇస్తానంటూ ప్రతిపాదన చేశాడు.
ఉన్నతాధికారుల సీరియస్:
అతడి మాటలకు ఖంగుతిన్న సదరు మహిళ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ అర్చిత్ చందక్ సదరు అధికారిని తక్షణమే విధుల్లోంచి తొలగిస్తూ (సస్పెండ్) ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఇలాంటి అకృత్యాలకు సిబ్బంది పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది.






