- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prohibited Drugs : భారీగా నిషేధిత ఇంజెక్షన్ల పట్టివేత
డ్రగ్స్ ముఠాల(Drugs Maffia)పై ముంబై పోలీసులు(Mumbai Police) మరోసారి కొరడా ఝుళిపించారు.

దిశ, వెబ్ డెస్క్ : డ్రగ్స్ ముఠాల(Drugs Maffia)పై ముంబై పోలీసులు(Mumbai Police) మరోసారి కొరడా ఝుళిపించారు. కీలక సమాచారం అందటంతో మరికొద్దిసేపట్లో దేశం దాటనున్న భారీ నిషేధిత మందులను చాకచక్యంగా పట్టుకున్నారు. మనదేశంలో నిషేధించిన మెడికల్ డ్రగ్స్(Prohibited Medical Drugs) గుట్టుచప్పుడు కాకుండా కార్గో విమాన సర్వీసుల(Cargo Flight Services) ద్వారా విదేశాలకు పంపిస్తున్నారనే సమాచారాన్ని ఆదివారం ఉదయం ఇంటెలిజెన్స్ వర్గాలు(Intelligence Bureau) మహారాష్ట్ర(Maharashtra)లో ముంబైలోని ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(Chatrapathi International Airport) అధికారులకు చేరవేశారు. తక్షణమే అప్రమత్తమైన విమానాశ్రయ వర్గాలు, కస్టమ్స్ అధికారుల(Customes Officers)తో కలిసి అన్ని కార్గో సర్వీసులను నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో.. పెద్ద ఎత్తున నిషేధిత మెడిసిన్స్ ను గుర్తించారు అధికారులు.
వీటిలో 5000 నిషేధిత కేటామైన్ ఇంజక్షన్స్(Cetamaina Injections) తో పాటు ఇతర నిషేధిత మందులు ఉన్నాయి. ఏకంగా 15 బాక్సుల మెడికల్ డ్రగ్స్ ఉండటంతో కస్టమ్స్ ఆఫీసర్స్ విస్తుపోయారు. కాగా వీటన్నిటి థాయిలాండ్(Thailnand) రాజధాని బ్యాంకాక్(Bangkok)కు ఎగుమతి చేసేందుకు చేరవేస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. వీటిని ఎవరు సరఫరా చేస్తున్నారో కనుక్కునే పనిలో పడ్డారు విమాశ్రయ పోలీసులు. త్వరలోనే నిందితులను పట్టుకొని మీడియా ముందు ప్రవేశ పెడతామని తెలియ జేశారు. అయితే ఈ డ్రగ్స్ సరఫరా వెనుక అతర్జాతీయ ముఠాలు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. అడపా దడపా నిషేధిత మందులు విదేశాలకు రవాణా అవుతూ పట్టుబడుతున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇదే మొదటిసారి.






