జైషే మహమ్మద్ ఉగ్రవాదుల చివరి క్షణాలు.. డ్రోన్ ఫుటేజ్ విడుదల చేసిన ఆర్మీ

by Ramesh Naini |   (  Updated:2025-05-15 14:28:47  IST  )

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

జైషే మహమ్మద్ ఉగ్రవాదుల చివరి క్షణాలు.. డ్రోన్ ఫుటేజ్ విడుదల చేసిన ఆర్మీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Jammu-Kashmir) జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం నుంచి నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. అవంతిపొరా ప్రాంతంలోని నాడర్, థ్రాల్ గ్రామాల్లో గురువారం ఉదయం ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో (Jaish-e-Mohammed) జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. అయితే ఉగ్రవాదులు తలదాచుకున్న చివరి క్షణాలను ఇండియన్ ఆర్మీ వీడియో తీసింది. ఈ మేరకు డ్రోన్ ఫుటేజీని ఆర్మీ అధికారులు విడుదల చేశారు. ఉగ్రవాదులను డ్రోన్‌ల సహాయంతో గుర్తించి, ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించి మట్టుబెట్టారు. వీడియోలో.. ఓ ఉగ్రవాది ఆర్మీకి కనబడకుండా దాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ అతనిని డ్రోన్ కెమెరాతో సహాయంతో బలగాలు గమనిస్తున్నాయని తెలుసులేకపోతాడు. అతని చేతిలో ఏకే 47 లాంటి గన్ ఉంటుంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టిన ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలను ఇండియన్ ఆర్మి విడుదల చేసింది. జైషే మహ్మద్‌ ఉగ్రముఠాకు చెందిన ఆసీఫ్ షేక్‌, యావర్ భట్, అమీర్ నాజిర్‌గా అధికారులు గుర్తించారు. ఇవాళ బలగాల కాల్పుల్లో హతమయ్యారు. కాగా, మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని షుక్రూ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో లష్కరే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు ఉగ్రవాదుల వివరాలను అధికారులు గుర్తించారు. ఒకరు షోపియాన్ జిల్లా హీర్పోరా గ్రామానికి చెందిన షాహిద్ కుట్టే కాగా.. మరొకరు వాండూనా మెల్హోరా గ్రామానికి చెందిన అద్నాన్ షఫీ దార్‌గా గుర్తించారు.

Click For Tweet..

Next Story