- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్‌ఓసి వద్ద కాల్పుల మోత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
సోమవారం రాత్రి నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కాల్పుల మోత మోగింది. దీంతో భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య రాత్రి కాల్పులు జరగడం తో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్: సోమవారం రాత్రి నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కాల్పుల మోత మోగింది. దీంతో భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు (Terrorists), భద్రతా బలగాల మధ్య రాత్రి కాల్పులు జరగడం తో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి తర్వాత కూడా ఈ కాల్పులు కొనసాగినట్లు స్థానికులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని రెండు ప్రదేశాలు - మాచిల్, దుద్నియాల్ సెక్టార్లలో ఈ కాల్పులు, పేలుళ్లు సంభవించాయి. ఇందులో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. పోలీసుల ప్రకారం.. మాచిల్ ఎల్‌ఓసి సమీపంలో అనుమానాస్పద కదలికను దళాలు గుర్తించాయి. ఇది తక్షణ ప్రతిస్పందనకు దారితీసింది. "సైన్యం అనుమానిత చొరబాటుదారులను అడ్డగించడంతో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. కాగా మరింత మంది ఉగ్రవాదులు ఉండవచ్చనే సమాచారంతో మంగళవారం ఉదయం కూడా భద్రతా దళాలు తమ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిసింది.






