- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాల కూంబింగ్.. భారీ ఆయుధాల డంప్ స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సత్ఫలితాలను ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బీజాపూర్ (Bijapur) జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిధిలో మావోయిస్టులు అత్యంత రహస్యంగా భూమిలో పాతిపెట్టిన భారీ ఆయుధాల డంప్‌ను పోలీసులు, భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టులకు చెందిన భారీ సంపద బయటపడింది. 32 అత్యాధునిక ఆయుధాలు.. అందులో ఏకే-47, ఇన్సాస్ వంటి హై-టెక్ రైఫిళ్లతో పాటు ఇతర యుద్ధ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అదేవిధంగా సుమారు రూ.65.5 లక్షల లిక్విడ్ క్యాష్‌ను కూడా సీజ్ చేశారు. ఈ నగదును విరాళాలు, అక్రమ వసూళ్ల ద్వారా పోగు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ముమ్మరంగా కూంబింగ్..
గత కొద్ది రోజులుగా బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు జరుపుతున్న ముమ్మర గాలింపు చర్యల్లో ఈ భారీ ఆయుధాల డంప్ వెలుగుచూసింది. ఈ పరిణామంతో మావోయిస్టుల నెట్‌వర్క్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీజాపూర్ జిల్లా పరిధిలోని అడవుల్లో భద్రతా బలగాలు, పోలీసుల జాయింట్ కూబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.






