పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం.. సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులో ఆగంతకుడు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-22 06:14:39  IST  )

ప్రధాన మంత్రితో పాటు కేంద్ర మంతులు, ఎంపీలు ఉండే పార్లమెంట్‌ వద్ద భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది.

పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం.. సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులో ఆగంతకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రితో పాటు కేంద్ర మంతులు, ఎంపీలు ఉండే పార్లమెంట్‌ వద్ద భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం 6.30 ప్రాంతంలో ఓ ఆగంతకుడు పార్లమెంట్ ప్రహరీ పక్కనే రైల్ భవన్ వైపు ఉన్న చెట్టు సాయంతో పార్లమెంట్ కాంప్లెస్‌లోకి ప్రవేశించాడు. అనంతరం ఈ క్రమంలోనే సీసీ కెమెరా విభాగానికి చెందిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై అక్కడే ఉన్న విధులు నిర్వర్తిస్తున్న గార్డ్స్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఆ ఆగంతకుడిని CISF సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి అతడి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో భాగంగా ఆ వ్యక్తి మానసిక పరిస్థితి బాగాలేదని వెల్లడైంది.

Next Story