- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Security Drills: మే 7న మాక్ డ్రిల్స్ చేపట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తుందనే కథనాల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాకిస్థాన్ (India pakisthan) మధ్య యుద్ధం వస్తుందనే కథనాల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ (Union Home ministry) రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రుదాడి జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతను నిర్ధారించేలా ఈ నెల 7వ తేదీన మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తెలిపింది. మాక్ డ్రిల్ సమయంలో వైమాణిక దాడి చేసేటప్పుడు వార్నింగ్ ఇచ్చేలా సైరన్ మోగించడం, దాడుల సమయంలో తమను తాము రక్షించుకోవడానికి పౌరులు, విద్యార్థులు మొదలైన వారికి శిక్షణ ఇవ్వడం లాంటివి ఉన్నాయి. అలాగే క్రాష్ బ్లాక్అవుట్ చర్యలను అందించడం, ముఖ్యమైన కర్మాగారాలు, స్థావరాలను దాచడానికి ఏర్పాట్లు త్వరగా చేయబడతాయి. తరలింపు ప్రణాళికలపై రిహార్సల్ చేయాలని మంత్రిత్వ శాఖ ఆర్డర్స్ ఇచ్చింది.
పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాక్ మధ్య మధ్య ఉద్రిక్తత పెరిగిన సమయంలో, పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఈ సూచనలను ఇచ్చింది. కాగా, చివరిసారిగా ఇటువంటి విన్యాసాలు 1971లో జరగగా ఆ ఏడాది భారత్ పాక్ యుద్ధం జరిగింది. దీంతో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.






