Devendra Fadnavis: దేవేంద్ర ఫడ్నవీస్‌కు భద్రత పెంపు

by Mahesh Kanagandla |   (  Updated:2026-04-13 14:21:40  IST  )

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు భద్రతను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Devendra Fadnavis: దేవేంద్ర ఫడ్నవీస్‌కు భద్రత పెంపు
X


- ప్రాణ హాని ఉన్నదని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20వ తేదీన జరగనున్న తరుణంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రాణ హాని ఉన్నదని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయన భద్రతను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ ఉన్నది. అదనంగా ఒక ఎక్స్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఆయన భద్రతకు అధికారులు కేటాయిస్తూ నిర్ణయించారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హాని తలపెట్టాలని జరిగిన ఒక సంభాషణను నిఘా వర్గాలు పసిగట్టాయని రాష్ట్ర హోం శాఖకు చెందిన ఓ అధికారి తెలిపినట్టు వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20వ తేదీన ఒకే విడతలో జరగనున్నాయి. మూడు రోజుల తర్వాత ఫలితాలు వెలువడతాయి.

Next Story