- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల పెంపు
సికింద్రాబాద్–తిరుపతి (Secunderabad to Tirupati) మార్గంలో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు (Vande Bharat Express) ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్–తిరుపతి (Secunderabad to Tirupati) మార్గంలో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు (Vande Bharat Express) ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టికెట్లకు భారీ డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో, రైల్వే అధికారులు ఈ రైలు బోగీల సంఖ్యను మరింత పెంచారు.
2023 ఏప్రిల్ 9న ప్రారంభమైన ఈ వందేభారత్ సేవ మొదట్లో 8 బోగీలతో ప్రయాణం ప్రారంభించింది. అయితే కొద్ది నెలల్లోనే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో బోగీలను 16కి విస్తరించారు. తాజాగా డిమాండ్ మరింత పెరగడంతో బోగీల సంఖ్యను 20కి పెంచారు. దీంతో ఈ రైలు మొత్తం ప్రయాణికుల సామర్థ్యం 1,440 సీట్లకు చేరుకుంది.
ఇదే సమయంలో ఈ రైలు రూపురేఖల్లోనూ మార్పు తీసుకొచ్చారు. గతంలో తెలుపు రంగులో ఉన్న బోగీలను పూర్తిగా ఆరెంజ్ కలర్‌లోకి మార్చారు. కొత్త రంగు, పెరిగిన సామర్థ్యంతో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తోంది.






