Secular: ప్రవేశిక నుంచి ఆ పదాలను తొలగించాలి.. ఆర్‌ఎస్‌ఎస్ నేత దత్రాత్రేయ కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబాలే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Secular: ప్రవేశిక నుంచి ఆ పదాలను తొలగించాలి.. ఆర్‌ఎస్‌ఎస్ నేత దత్రాత్రేయ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని ప్రవేశిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగంలో సోషలిస్ట్, లౌకిక అనే పదాలను చేర్చారని, దేశంలో పార్లమెంట్, న్యాయవ్యవస్థ పని చేయని టైంలో ఈ పదాలను యాడ్ చేశారని తెలిపారు. కాబట్టి ఈ పదాలు కాన్సిట్యూషన్‌లో అలాగే ఉండాలా వద్దా అనే దానిపై చర్చ జరగాలని చెప్పారు. అత్యవసర పరిస్థితి విధించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దేశంలో అత్యవసర పరిస్థితి విధ్వంసం సృష్టించిన వారు నేడు రాజ్యాంగ కాపీతో తిరుగుతున్నారు. వారు ఇంకా క్షమాపణ చెప్పలేదు. మీ పూర్వీకులు అలా చేశారు. మీరు దేశానికి దీనికి క్షమాపణ చెప్పాలి’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

వారికి మనుస్మృతి కావాలి: రాహుల్ గాంధీ

దత్తాత్రేయ హొసబాలే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని అంగీకరించలేదని వ వారిని మనుస్మృతి మాత్రమే కావాలని విమర్శించారు. రాజ్యాంగం సమానత్వం, లౌకికవాదం, న్యాయం గురించి మాట్లాడుతుంది కాబట్టి వారికి అది నచ్చదని తెలిపారు. పేదల హక్కులను లాక్కుని వారిని బానిసలుగా మార్చే లక్ష్యంతోనే ఆర్ఎస్ఎస్ పని చేస్తుందని ఆరోపించారు. కానీ వారి కల ఎప్పటికీ నెరవేరబోదని స్పష్టం చేశారు. కాగా, 1976లో 42వ సవరణ ద్వారా సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే ఆ టైంలో దేశంలో ఎమర్జెన్సీ విధించారు.

Next Story