- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత నేవీ రహస్య సమాచారం పాక్‌కు లీక్
భారత నేవీ రహస్య సమాచారం పాక్ కు చేరవేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : భారత నేవీ రహస్య సమాచారం పాక్ కు చేరవేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని ఉడిపి జిల్లా మల్పేలో ఉన్న కొచ్చిన్ షిప్‌యార్డ్ యూనిట్‌లో భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేసారు. తాజాగా ఈ కేసులో పోలీసులు మూడో నిందితుడిని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా కైలాస్ నగరి నివాసి అయిన హీరేంద్ర కుమార్ అలియాస్ భరత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లోని సబ్‌కాంట్రాక్టర్ సంస్థ శుశ్మ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసిన రోహిత్, సంత్రి అనే ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసారు.
వారు నేవీ నౌకల నంబర్లు, డాకింగ్ వివరాలు తదితర సున్నితమైన సమాచారాన్ని డబ్బు కోసం వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. మూడో నిందితుడు హీరేంద్ర కుమార్ వీరికి సిమ్ కార్డులు సరఫరా చేయడంతో పాటు, ఓటీపీలను షేర్ చేసి వాట్సాప్ యాక్టివేషన్‌కు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. కర్కళ సబ్‌డివిజన్ ఏఎస్‌పీ హర్ష ప్రియంవద నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుండగా.. జాతీయ భద్రతకు ముప్పు కలిగించిన ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని తెలిపారు.






