SCO: ఉగ్రవాద ప్రస్తావన లేకపోతే ఒప్పందాలు ఎందుకు.. ఎస్సీఓ వైఖరిపై జైశంకర్ ఫైర్

by B.Srinivas |

షాంఘై సహకార సంస్థ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించడాన్ని జైశంకర్ సమర్థించారు.

SCO: ఉగ్రవాద ప్రస్తావన లేకపోతే ఒప్పందాలు ఎందుకు.. ఎస్సీఓ వైఖరిపై జైశంకర్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: షాంఘై సహకార సంస్థ (SCO) ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) నిరాకరించడాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) సమర్థించారు. ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్స్ సదస్సులో ఉగ్రవాదంపై ప్రస్తావించాలని భారత్ కోరుకుంటుందని, కానీ ఈ విషయాన్ని సదస్సులో లేవనెత్తకపోవడం సరికాదన్నారు. కూటమిలోని సభ్య దేశానికి ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడటమే ఎస్సీఓ ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈ విషయంపై రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయం సరైందేనని చెప్పారు. ఎస్సీఓ లక్ష్యం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమేనని, కానీ కీలక సదస్సుల్లో టెర్రరిజం ప్రస్తావనే లేకపోతే ఒప్పందాలు ఎందుకని ప్రశ్నించారు.

ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న చర్య కేవలం దౌత్య పరమైన సమస్య మాత్రమే కాదని, జాతీయ భద్రతను పరిరక్షించడానికేనని నొక్కి చెప్పారు. కాగా, చైనాలోని కింగ్‌డావోలో ఎస్సీఓ రక్షణ మంత్రు సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో పహెల్గాం ఉగ్రదాడి (Pahelgam Terror attack) ని ప్రస్తావించనందున ఎస్సీఓ సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు రాజ్ నాథ్ సింగ్ నిరాకరించారు.

Next Story