- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొవిడ్ కంటే డేంజరస్ వైరసులు.. ప్యాండెమిక్‌కు ఒక్క మ్యుటేషన్ దూరంలో!
కొవిడ్ కంటే డేంజరస్ వైరసుల బృందంపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. మరొక్క మ్యుటేషన్‌తో ప్యాండెమిక్ ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సైంటిస్టులో షాకింగ్ విషయం వెల్లడించారు. గబ్బిలాల్లో ఉండే మరొక వైరస్ గ్రూప్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోందని వాళ్లు చెప్పారు. ఈ కొత్త వైరస్ కూడా 2012లో ప్రపంచాన్ని వణికించిన మెర్స్-కోవ్ కుటుంబానికి చెందినదని తెలిపారు. మెర్స్-కోవ్ సోకిన వారిలో ఏకంగా 34 శాతం మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు కనుగొన్న వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మెర్స్-కోవ్ గ్రూపులో చాలా తక్కువ మందికి తెలిసిన మెర్బెకోవైరసులపై వీళ్లు పరిశోధనలు చేస్తున్నారు. వీటిలో హెచ్‌కేయూవీ5 అనే ఒక చిన్న వైరసుల గ్రూప్.. సైంటిస్టులను భయపెడుతోంది. ‘ఈ వైరసులపై ఎక్కువ పరిశోధనలు జరగలేదు. అయితే ఇవి శరీరంలోని కణాలను ఇన్‌ఫెక్ట్ చేస్తాయి. ప్రస్తుతానికి మనుషులకు ఈ వైరసులు సోకడం లేదు. కానీ మరొక్కసారి మ్యుటేట్ అయితే ఈ వైరసులు మనుషులకు కూడా ప్రమాదకరంగా మారతాయి’ అని శాస్త్రవేత్తలు చెప్తు్న్నారు.
ఈ హెచ్‌కేయూ5 వైరసులు కూడా కొవిడ్19 వైరస్ వలె స్పైక్ ప్రొటీన్ సాయంతో కణాలను అంటిపెట్టుకొని అనారోగ్యానికి గురిచేస్తాయని తెలుస్తోంది. కేవలం గబ్బిలాల్లోనే ఉండే ఈ వైరస్‌లోని కొన్నిరకాలు.. చైనాలో మింక్స్‌కు కూడా సోకాయట. అంటే వేరే జంతువులకు కూడా సోకేలా ఇది మ్యుటేట్ అవుతోందన్నమాట. చైనాలో గబ్బిలాల్లోని వైరసులపై ఎన్నో ప్రయోగాలు చేసి, ‘బ్యాట్ వుమెన్’గా పేరొందిన షి జెంగ్‌లీ కూడా ఈ వైరసులపై ప్రయోగాలు చేశారు. ల్యాబ్ పరిశోధనల్లో హెచ్‌కేయూ5 వైరసులు మనుషుల పేగులు, ఊపిరితిత్తులను ఇన్‌ఫెక్ట్ చేసినట్లు ఆమె కనుగొన్నారు. అదే సమయంలో ఈ వైరస్‌ను టార్గెట్ చేసేలా కొన్ని యాంటీబాడీస్, యాంటీ వైరల్ డ్రగ్స్‌ను కూడా పరిశోధకులు తయారు చేస్తున్నారని సమాచారం. కరోనా అంత వేగంగా వ్యాపిస్తూ, 34 శాతం మృత్యురేటు ఉండే వైరస్ ప్రపంచానికి చాలా ప్రమాదకరమని సైంటిస్టులు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ వైరస్ మనుషులకు సోకడం లేదని, కాబట్టి ఆందోళన అక్కర్లేదని చెప్పారు.






