- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు స్కూల్స్, కాలేజీలు బంద్... క్లారిటీ ఇదే!
రేపు స్కూలు ( School) అలాగే కాలేజీలకు ( Colleges) సెలవు ఉంటుందని.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత్

దిశ, వెబ్ డెస్క్: రేపు స్కూలు ( School) అలాగే కాలేజీలకు ( Colleges) సెలవు ఉంటుందని.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత్ బంద్ ( Bharath Bandh) ఉన్న నేపథ్యంలో... రేపు విద్యాసంస్థలకు సెలవు ( Holiday) ఉంటుందని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక... జులై 9 అంటే రేపటి రోజున భారత బంద్ కు పిలుపునిచ్చింది.
బీమా, విద్యుత్, బ్యాంకింగ్, పోస్టల్ తదితర రంగాలపై బంద్ ప్రభావం ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాలేజీలు, పాఠశాలలకు ఎలాంటి సెలవు ప్రకటన రాలేదు. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి వరకు దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై క్లారిటీ రాకముందే కొంతమంది రేపు సెలవు అంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే రవాణా అంతరాయం, నిరసనల కారణంగా కొన్ని విద్యాసంస్థల కార్యకలాపాలకు ఆటంకం కలిగే ఛాన్స్ ఉంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అటు భారత్ బంద్ నేపథ్యంలో... పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.






