కెనడాలో స్కూల్లో కాల్పులు.. 10 మంది దుర్మరణం.. మోడీ దిగ్భ్రాంతి

by Phanindra |

కెనడాలో స్కూల్లో జరిగిన కాల్పుల్లో 10 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనపై మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

కెనడాలో స్కూల్లో కాల్పులు.. 10 మంది దుర్మరణం.. మోడీ దిగ్భ్రాంతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ స్కూల్ పరిసర ప్రాంతాల్లో 8 మంది మరణించారని, వారిలో నిందితురాలు కూడా ఉందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితురాలను తనను తాను కాల్చుకొని మరణించినట్లు చెప్పారు. అలాగే స్కూల్ సమీపంలోని ఇంట్లో మరో ఇద్దరు కూడా మరణించారని, దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరిందని అధికారులు తెలిపారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని తెలియజేశారు. మరణించిన నిందితురాలు ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మోడీ దిగ్భ్రాంతి..

ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘కెనడాలో జరిగిన ఈ దారుణం గురించి తెలిసి తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యా. బాధిత కుటుంబాలను నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఈ కష్టకాలంలో కెనడాకు భారత్ మద్దతుగా నిలుస్తుంది’ అని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Next Story