School: 11.70 లక్షల మంది పిల్లలు బడి మానేశారు: లోక్ సభకు తెలిపిన కేంద్రం

by B.Srinivas |

2024-25 విద్యాసంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 11,70,404 మంది పిల్లలు బడిమానేసినట్టు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

School: 11.70 లక్షల మంది పిల్లలు బడి మానేశారు: లోక్ సభకు తెలిపిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: 2024-25 విద్యాసంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 11,70,404 మంది పిల్లలు బడిమానేసినట్టు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి (Jayanth chowdry) లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఉత్తరప్రదేశ్ (Utharapradesh) రాష్ట్రంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. యూపీలో 7.84 లక్షలు, జార్ఖండ్ 65,000, అసోంలో 63,000 మంది పిల్లలు బడి బయట ఉన్నారని పేర్కొన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న వాటిలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇక్కడ కేవలం ఇద్దరు మాత్రమే బడిమానేశారని వెల్లడించారు. ఇక, పుదుచ్చేరిలో నలుగురు సిక్కింలో 74 మంది ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలైప లడఖ్ (Ladakh), లక్షద్వీప్‌లలో ఎవరూ డ్రాప్ ఔట్ కాలేదని తెలిపారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) పోర్టల్ ప్రకారం.. 2021-22 విద్యా సంవత్సరంలో మొత్తం 26 కోట్ల మంది పిల్లలు పాఠశాలల్లో చేరారు. వీరిలో 12.73 కోట్ల మంది బాలికలు 13.79కోట్ల మంది బాలురు ఉన్నారు.

Next Story