26 ఏళ్ల తర్వాత సీన్ రిపీట్.. ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 07:32:28  IST  )

దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్ వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రాధ్యాన్యతను సంతరించుకోబోతున్నాయి.

26 ఏళ్ల తర్వాత సీన్ రిపీట్.. ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్ వార్షిక బడ్జెట్ సమావేశాలు (Annual Budget Meetings) ప్రాధ్యాన్యతను సంతరించుకోబోతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ.. అది కూడా ఆదివారం రోజున ప్రవేశపెట్టనుంది. సాధారణంగా సెలవు దినాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆనవాయితీ లేనప్పటికీ, నరేంద్ర మోదీ సర్కార్ ఆ రూల్‌ను బ్రేక్ చేయబోతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ప్రసంగించనున్నారు. అనంతరం అదే రోజున ఆర్థిక సర్వేను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act, 2025) నేపథ్యంలో, ఈ బడ్జెట్‌లో సామాన్యులకు పన్ను రాయితీలు, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది.

ఆదివారమే ఎందుకంటే..

అయితే, 2017 నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం సర్వసాధారణం. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే నిధుల కేటాయింపులు, ఇతర పరిపాలనా ప్రక్రియలు పూర్తి కావాలనే లక్ష్యంతో కేంద్రం ఆ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ, ఆ పరంపరను కొనసాగిస్తూ అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గతంలో 1999లో యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) కూడా సరిగ్గా ఇలాగే ఆదివారం నాడే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ బడ్జెట్‌తో ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ (Morarji Desai) అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా, చిదంబరం (Chidambaram) 9 సార్లు ప్రవేశపెట్టారు. అయితే, వరుసగా 9 సార్లు ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్‌కే దక్కనుంది.

Read More..

అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం.. SBI నివేదిక

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతోన్న చికిత్స

Next Story