Supreme Court: గోద్రా రైలు ఘటనపై ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టులో విచారణ

by Shamantha N |

గోద్రా రైలు ఘటనపై(Godhra train burning case) ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టనుంది.

Supreme Court: గోద్రా రైలు ఘటనపై ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టులో విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో: గోద్రా రైలు ఘటనపై(Godhra train burning case) ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టనుంది. గుజ‌రాత్ ప్ర‌భుత్వంతో పాటు అనేక మంది దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై ఉన్నత న్యాయస్థానం వాదనలు విననుంది. అయితే, గురువారం ఈ కేసుపై విచారణ జరగగా..విచార‌ణ స‌మ‌యంలో ఓ నిందితుడి త‌ర‌పున లాయ‌ర్ హాజ‌ర‌య్యారు. కానీ ఆధారాలు స‌మ‌ర్పించ‌లేక‌పోయారు. గ‌త ఏడాది నుంచి ఈ కేసును ఇప్ప‌టి ఐదు సార్లు వాయిదా వేశామని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక, మ‌ళ్లీ కేసుని వాయిదా వేయ‌బోమ‌ని.. ఫిబ్రవరి 13న తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కొంద‌రు నిందితుల‌కు చెందిన క్ష‌మాభిక్ష పిటిష‌న్లు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నట్లు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ కేసు విచార‌ణ‌కు మ‌రో తేదీని ఇవ్వ‌బోమ‌న‌ని జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి, అర‌వింద్ కుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది. అయితే, గుజ‌రాత్ ప్ర‌భుత్వ అప్పీల్‌పై ముందుగా విచార‌ణ చేప‌ట్టాల‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది సంజ‌య్ హెగ్డే కోరారు.

గుజరాత్ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ..

ఇకపోతే, 2002లో ఫిబ్ర‌వ‌రి 27న స‌బ‌ర్మ‌తి రైలుకు చెందిన ఎస్-6 బోగీలో మంటలు చెల‌రేగాయి. ఈ మంటల్లోపడి సుమారు 59 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. అయితే, ఆ కేసులో 2017లో గుజ‌రాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ అనేక మంది సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులోజీవిత ఖైదు శిక్ష ప‌డిన 11 మంది నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని కోరుతూ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గుజ‌రాత్ స‌ర్కారు సుప్రీంకోర్టుని ఆశ్ర‌యించింది. దీనిపైనే, సుప్రీంకోర్టు గురువారం వాదనలు వినగా.. ఫిబ్రవరి 13కి తదుపరి విచారణను వాయిదా వేసింది.

Next Story