సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు

by Naga Rani Yarlagadda |

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో చారిత్రాత్మక నిర్ణయం..

సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) చరిత్రలోనే తొలిసారిగా ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది నియామకాలు, పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)లకు రిజర్వేషన్ల (SC, ST Reservations) విధానాన్ని అధికారికంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జూన్ 24న అంతర్గత సర్క్యులర్ ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం.. రిజర్వేషన్ల విధానం జూన్ 23 నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. దీనిప్రకారం కోర్టులో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎస్సీ వర్గాలకు 15 శాతం, ఎస్టీ వర్గాలకు 7.5 శాతం కోటా వర్తిస్తుంది. వీటి అమలుకు రూపొందించిన మోడల్ రిజర్వేషన్ రోస్టర్.. సంబంధిత రిజిస్టర్ల వివరాలను కోర్టు అంతర్గత నెట్ వర్క్ అయిన సుప్ నెట్ లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

Next Story