Justice Varma: జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు పిటిషన్‌ అత్యవసరంగా విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

by S Gopi |

పిటిషనర్ తరపు న్యాయవాది జస్టిస్ యశ్వంత్ వర్మను ఏకవచనంతో సంభోదించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Justice Varma: జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు పిటిషన్‌ అత్యవసరంగా విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వివాదంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది జస్టిస్ యశ్వంత్ వర్మను ఏకవచనంతో సంభోదించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తిని అలా పిలవడానికి ఆయన మీ స్నేహితుడా అని తప్పుబట్టింది. అయినప్పటికీ న్యాయమూర్తి స్థానానికి జస్టిస్ వర్మ అనర్హుడని చెప్పడంతో, ఉన్నత న్యాయస్థానానికి పాఠాలు నేర్పొద్దని అసహనం వ్యక్తం చేసింది. ఇక, జస్టిస్ వర్మపై పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానంపై 100 మంది సభ్యులు సంతకాలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారు. సోమవారం మొదలైన పార్లమెంట్ సమావేశాల్లోనే దీన్ని తీసుకొస్తామని, ఆయనను తొలగించే విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టు ఆయన వెల్లడించారు.

Next Story