- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > Supreme Court: మద్రాస్, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు ఎస్సీ కొలీజియం ఆమోదం
Supreme Court: మద్రాస్, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు ఎస్సీ కొలీజియం ఆమోదం
by S Gopi |
ఈ మేరకు మద్రాసుకు ఇద్దరు, తెలంగాణకు ముగ్గురిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: మద్రాసు, తెలంగాణ హైకోర్టుల్లో ఐదుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించే ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మద్రాసుకు ఇద్దరు, తెలంగాణకు ముగ్గురిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం సమావేశంలో.. మద్రాసు హైకోర్టులో జస్టిస్ వెంకటాచారి లక్ష్మీనారాయణన్, జస్టిస్ పెరియసామి వడమలైలను అదనపు న్యాయమూర్తుల నియామక ప్రతిపాదనను ఆమోదించింది. తెలంగాణ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా అదనపు జడ్జీలు జస్టిస్ లక్ష్మీనారారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ సుజనా కళాసికం నియామకం కోసం కొలిజియం ఆమోదిస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది.
Next Story






