Supreme Court: వక్ఫ్ సవరణచట్టం అమలుపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

by Shamantha N |

సివిల్ కేసును క్రిమినల్‌ కేసుగా మార్చినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు (Supreme Court) రూ.50,000 జరిమానా విధించింది.

Supreme Court: వక్ఫ్ సవరణచట్టం అమలుపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్‌ సవరణ చట్టం-2025 (Waqf Amendment Act) రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ చట్టం అమలుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, పిటిషనర్లు కోరినట్టు వక్ప్ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు బెంచ్ నిరాకరించింది. విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సీజేఐ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్‌ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్‌ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని వ్యాఖ్యానించారు. ‘సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం. అయితే ఇది దుర్వినియోగమైంది. నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. హిందువుల బోర్డులో ముస్లింలను అంగీకరిస్తారా? పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని పేర్కొన్నారు. "చాలా కాలంగా అక్కడ ఉన్న 'వక్ఫ్ బై యూజర్'లను మీరు ఎలా నమోదు చేస్తారు? వారి వద్ద ఏ పత్రాలు ఉంటాయి? అది ఏదో రద్దుకు దారితీస్తుంది.” అని దర్మాసనం పేర్కొంది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకికమైన స్వభాన్ని కలిగిఉందంది. వక్ఫ్‌ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది.

కపిల్ సిబాల్ వాదనలు..

వక్ప్ సవరణ చట్టం పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైంది’ అని అన్నారు. కేంద్రప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామన్నారు. ‘వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమే. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి’ అని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసుని గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.

Next Story