NEET-PG: ఆగస్టు 3న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష

by Shamantha N |   (  Updated:2025-06-06 15:40:48  IST  )

నీట్‌ పీజీ-25 (NEET-PG 2025) ప్రవేశ పరీక్షకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆగస్టు 3న ఎగ్జామ్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతినిస్తూ తీర్పు వెల్లడించింది.

NEET-PG: ఆగస్టు 3న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్‌ పీజీ-25 (NEET-PG 2025) ప్రవేశ పరీక్షకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆగస్టు 3న ఎగ్జామ్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతినిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, ఒకే షిఫ్ట్ లో పరీక్షను ముగించాలని ఇటీవలే కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఈబీ అభ్యర్థన మేరకు పరీక్ష నిర్వహణ తేదీని జూన్‌ 15 నుంచి మార్చుకునేందుకు వీలు కల్పించింది. దీంతో, నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NEB) ఈ కొత్త తేదీని కోర్టుకు ప్రతిపాదించింది. కాగా.. అత్యున్నత న్యాయస్థానం దీనికి ఓకే చెప్పింది.

ఇటీవలే తీర్పు..

కాగా.. నీట్‌ పరీక్షా విధానంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. నీట్ పీజీ-25 (NEET-PG 2025) ప్రవేశ పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలంది. అభ్యర్థులందరికీ "న్యాయమైన, సహేతుకమైన, సమానమైన" పోటీకి నిర్వహించేందుకు ఒకే షిఫ్ట లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.ఈ మేరకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షను రెండు విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మారి కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎన్‌ఈబీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే దానిని ఒకేవిడతలో నిర్వహించేలా బోర్డ్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత అధికారులకు ఈ ఆదేశాలు ఇచ్చింది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. అయితే ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎన్‌ఈబీ వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. అంతేకాకుండా, "ఏ రెండు ప్రశ్నపత్రాలు ఒకే స్థాయిలో డిఫికల్ట్ గా లేదా ఈజీగా ఉంటాయని ఎప్పుడూ చెప్పలేము" అని సుప్రీంకోర్టు పేర్కొంది. జూన్ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని వ్యాఖ్యానించింది. ఏర్పాట్లకు సమయం సరిపోదని అధికారులు భావిస్తే పరీక్ష తేదీని పొడిగించుకొనే స్వేచ్ఛనిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నీట్ పీజీ పరీక్ష తేదీని మార్పు చేస్తూ ప్రకటించడం గమనార్హం.

Next Story