- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్‌బీఐ మేనేజర్ బాగోతం బట్టబయలు.. మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్న వీడియో వైరల్
హిమాచల్ ప్రదేశ్ ఉనాలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. సర్వీస్ మేనేజర్ మణీంద్ర కన్వర్.. జూనియర్ మహిళా సహోద్యోగికి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు, సెక్సువల్ ఫేవర్స్ కోసం ఐఫోన్ ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి

దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్ ఉనాలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. సర్వీస్ మేనేజర్ మణీంద్ర కన్వర్.. జూనియర్ మహిళా సహోద్యోగికి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు, సెక్సువల్ ఫేవర్స్ కోసం ఐఫోన్ ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెతోపాటు మరో ఇద్దరు మహిళా ఉద్యోగులను కూడా ఇలాగే వేధించినట్లు తెలుస్తోంది. కాగా వీరిలో ఒక బాధితురాలు అతని అనుచిత ప్రవర్తనను వీడియో రికార్డ్ చేసింది.
మీటింగ్ జరుగుతుండగానే మహిళా ఉద్యోగిని హరాజ్ చేస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. అసభ్యకరంగా తాకుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. వెంటనే అతన్ని సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం సాధించినా మహిళలకు వేధింపులు తప్పడం లేదని.. ఇంత జరిగినా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.






