- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్కూల్‌కి కొత్త బస్సును దానం చేసిన ఎస్బీఐ
భారతదేశంలో అత్యంత పెద్ద నెట్ వర్క్ కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొంత కాలంగా సోషల్ రెస్పాన్సిబిలిటీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో అత్యంత పెద్ద నెట్ వర్క్ కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) గత కొంత కాలంగా సోషల్ రెస్పాన్సిబిలిటీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు లేహ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా (NISR)కు ఒక స్కూల్ బస్సును దానం చేసింది. ఈ కొత్త బస్సును ఎస్‌బీఐ చండీగఢ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కృష్ణ శర్మ లేహ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో NISR డైరెక్టర్ డా. పద్మ గుర్మెట్‌కు అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జె & కె జోన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జయంత్ మణి, ఎస్‌బీఐ లేహ్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ అనిల్ టాండన్, ఎస్‌బీఐ సీనియర్ అధికారులు, అలాగే NISR అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా NISR డైరెక్టర్ డా. పద్మ గుర్మెట్, విద్యార్థుల కోసం స్కూల్ బస్సు అందజేసినందుకు ఎస్‌బీఐకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా NISR యొక్క లక్ష్యాలు, ప్రజా సేవా కార్యక్రమాల గురించి కూడా వివరించారు. చండీగఢ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కృష్ణ శర్మ మాట్లాడుతూ.. ప్రజా సేవా కార్యక్రమాలు, ప్రాంతీయ అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో SBI కట్టుబడి ఉందని పేర్కొన్నారు. లడాఖ్ సామాజిక-ఆర్థిక అభివృద్ధి లో భాగస్వామ్యం కావడమే తమ CSR కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






