- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tamilanadu: హిందీ వల్ల 25 భాషలు కనుమరుగయ్యాయి: ఎంకె స్టాలిన్
హిందీ ఆధిపత్యం కారణంగా అనేక ప్రాచీన భాషలు మరణిస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ, తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బలవంతంగా హిందీ భాషను రుద్దడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా హిందీ భాషను అమలు చేయడం వల్ల ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయని విమర్శించారు.హిందీ ఆధిపత్యం కారణంగా అనేక ప్రాచీన భాషలు మరణిస్తున్నాయి. దీనికి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? గడిచిన 100 ఏళ్లలో 25 ఉత్తర భారతీయ స్థానిక భాషలు చరిత్రలో కలిసిపోయాయి. ఇంకా భోజ్‌పురి, మార్వారి, బుందేలీ, మైథిలీ, కుమావోని, మాల్వీ, ఛత్తీస్‌గఢి, అంజికా, గర్వాలి, మాగాహి, సంథాలీ లాంటి భాషలు కొన ఊపిరితో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నడూ హిందీ రాష్ట్రాలు కాదు, ఆయా రాష్ట్రాల సొంత భాషలు ఎప్పుడో కనుమరుగయ్యాయి. తమిళనాడులో అటువంటి పరిస్థితి తలెత్తకూడదనే పోరాడుతున్నాం. ఒక రాష్ట్ర సంస్కృతిని, జాతిని ద్వంసం చేసేందుకు భాషలపై దాడి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు త్రిభాషా విధానాన్ని అంగీకరిస్తే, మాతృభాష విస్మరించినట్టే. భవిష్యత్తులో సంస్కృత భాషను రద్దుతారని స్టాలిన్ తెలిపారు. పాఠశాలల్లో సంస్కృతంతో పాటు ఇతర భారతీయ భాషలు బోధించాలని, తమిళం వంటి ఇతర భాషలను ఆన్‌లైన్‌లో బోధించవచ్చని ఎన్ఈపీ నిబంధనలు చెబుతున్నాయని, తద్వారా తమిళం లాంటి భాషలను తొలగించి, సంస్కృతాన్ని బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నాలు కేంద్రం చేస్తోందని పేర్కొన్నారు. కాగా, జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)లో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని నిబంధనలు రూపొందించింది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉండనున్నట్టు ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషకు, తమిళ ప్రజలకు నష్టం ఏర్పడే ఎలాంటి చర్యలనూ అనుమతించేది లేదని స్టాలిన్ స్పష్టం చేశారు.






