విదేశీ కరెన్సీ స్మగ్లింగ్.. ఎయిర్‌పోర్టులో పట్టుబడిన మహిళ

by Naga Rani Yarlagadda |

విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ చేస్తున్న ఓ మహిళ ఎయిర్‌పోర్టులో అధికారులకు పట్టుబడింది. కేరళలోని నేదుంబస్సేరీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.

విదేశీ కరెన్సీ స్మగ్లింగ్.. ఎయిర్‌పోర్టులో పట్టుబడిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ చేస్తున్న ఓ మహిళ ఎయిర్‌పోర్టులో అధికారులకు పట్టుబడింది. కేరళలోని నేదుంబస్సేరీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Nedumbassery International Airport)లో కస్టమ్స్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. సౌదీ నుంచి కేరళ వచ్చిన గీత అనే మహిళ.. అక్రమంగా 2 లక్షల సౌదీ రియల్స్ (Saudi Riyals)ను తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అల్యూమినియం కవర్ దొరికింది. ఆ కవర్లో ఉన్న కరెన్సీ విలువ రూ.44 లక్షలు ఉంటుందని తెలిపారు. గీత వద్ద నుంచి ఆ కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. విదేశీ కరెన్సీని అనుమతి లేకుండా తీసుకురావడం నేరంగా పరిగణిస్తారు. భారతదేశంలో విదేశీ కరెన్సీ లావాదేవీలు FEMA, 1999 చట్టం కింద నియంత్రించబడతాయి. ఈ చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి దేశంలోకి లేదా దేశం నుండి బయటకు తీసుకురాగల లేదా తీసుకెళ్లగల కరెన్సీ మొత్తంపై పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు 5,000 డాలర్లు (లేదా దానికి సమానమైన విలువ) కంటే ఎక్కువ నగదు కరెన్సీని తీసుకురావడం లేదా తీసుకెళ్లడం నిషేధించబడింది. తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నా, తీసుకురావాలన్నా కొన్ని అనుమతులు తీసుకోవాలి.

ఎక్కువ మొత్తంలో విదేశీ కరెన్సీని నియంత్రణ లేకుండా తీసుకురావడం మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగపడవచ్చు. దీనిని నియంత్రించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో అక్రమ నిధుల ప్రవాహాన్ని అరికడుతుంది. భారత కస్టమ్స్ సర్వీస్ ప్రకారం.. 10,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కరెన్సీని తీసుకురావడం లేదా తీసుకెళ్లాలంటే ముందుగా కస్టమ్స్ అధికారులకు సమాచారమివ్వాలి. దీనిని పాటించకపోతే.. అది చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణిస్తారు. ఇది జరిమానాలు, కరెన్సీ జప్తు, లేదా న్యాయపరమైన చర్యలకు దారితీయవచ్చు.

Next Story