Operation Sindoor: శిథిలమైన లష్కర్-జైష్ కేంద్రాలు.. శాటిలైట్ చిత్రాలు వైరల్

by Naga Rani Yarlagadda |

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన భీకర ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (PoJK)లోని 9 ఉగ్ర స్థావరాలపై "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) పేరుతో ఖచ్చితమైన దాడులు చేసింది.

Operation Sindoor: శిథిలమైన లష్కర్-జైష్ కేంద్రాలు.. శాటిలైట్ చిత్రాలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత సైన్యం (India Army) పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(POK)లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయకముందు, చేసిన తర్వాత.. పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తూ శాటిలైట్ చిత్రాలు విడుదలయ్యాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది ఇండియన్ ఆర్మీ. 9 శిబిరాలపై దాడి చేయగా.. ఉగ్రమూకల స్థావరాలు కకావికలమయ్యాయి. బహావల్ పుర్, మురిద్కేలో ధ్వంసమైన ఉగ్రశిబిరాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఈ శాటిలైట్ చిత్రాలు..ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో చూపించాయి. ముఖ్యంగా బహవల్‌పూర్‌లోని జామియా మసీదు, పాకిస్తాన్‌లోని మురిద్కే నగరం లక్ష్యంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన భీకర ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (PoJK)లోని 9 ఉగ్ర స్థావరాలపై "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) పేరుతో ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో లష్కర్-ఎ-తొయిబా (LeT), జైష్-ఎ-మహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన కీలక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

మే 7 తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 గంటల మధ్య 25 నిమిషాల వ్యవధిలో ఈ దాడులు నిర్వహించారు. భారత వైమానిక దళం SCALP క్రూయిజ్ మిసైల్స్, HAMMER బాంబులు, లాయిటరింగ్ మ్యూనిషన్స్‌ను ఉపయోగించి నాలుగు పాకిస్థాన్ స్థావరాలు, ఐదు PoK స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దాడుల్లో జైష్ అధినేత మసూద్ అజర్‌కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు, 4గురు సన్నిహితులు హతమైనట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సైన్యం జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి ఆర్టిలరీ షెల్లింగ్‌తో ప్రతిదాడి చేసింది. ఈ దాడుల్లో 13 మంది భారతీయ పౌరులు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించగా, లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలు మూతపడ్డాయి.

Next Story