అయోధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సరయూ నది...అప్రమత్తమైన అధికారులు

by Ajay Maddhiboyina |

ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.

అయోధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సరయూ నది...అప్రమత్తమైన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. సరయూ నది సైతం ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. అయోధ్య‌లో నది ఉధృతంగా ప్ర‌వ‌హించ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. వ‌ర‌ద ప్ర‌వాహం ప్రమాద స్థాయికి చేర‌డంతో న‌ర‌యూ ఘాట్‌లో హెచ్చరిక బోర్డులు పెట్టారు. ప్రమాద స్థాయి నీటిమట్టం 92.73 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 91.92 మీటర్లకు చేరుకుంది.

దీంతో భ‌క్తులు జాగ్త‌త్త‌గా ఉండాల‌ని న‌దిలో స్నానాలు చేయ‌వ‌ద్ద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు అయోధ్య‌లో ఎన్డీఆర్ఎఫ్ బ‌ల‌గాలు మోహ‌రించాయి. ఇదిలా ఉంటే సాధార‌ణంగా అయోధ్య‌కు వ‌చ్చే భ‌క్తులు మొద‌ట మోక్ష‌దామిని అయిన స‌ర‌యు న‌దిలో స్నానం చేస్తారు. త‌ర‌వాత అయోధ్య‌లోని మ‌ఠం, దేవాల‌యాల‌ను సంద‌ర్శించి పూజ‌లు చేస్తారు. కానీ నీటిమ‌ట్టం పెర‌గ‌డంతో భ‌క్తులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు నదిలో స్నానాలు చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Next Story