- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sankranti: కనుమ రోజు అక్కడ ఆడవాళ్లంతా వితంతు వేషం వేస్తారు.. ఎక్కడో తెలుసా?
Sankranti: సంక్రాంతి(Sankranti festival) పండగ తమిళనాడులోనూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. శివగంగై జిల్లాలోని సలుగైపురం ఊరిలో ఉత్సవాలను విభిన్న పద్దతిలో నిర్వహిస్తారు.

Sankranti: సంక్రాంతి(Sankranti festival)...మూడురోజుల పండగ. ఎన్నో సంబురాలు..మరెన్నో సంతోషాలు. వీటికి తోడు ఆచారాలు, సంప్రదాయాలు కూడా. తెలుగు రాష్ట్రాల్లోనే కదా పక్కరాష్ట్రంలో తమిళనాడు(Tamil Nadu)లోనూ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇక్కడి ఓ సంప్రదాయం వైవిధ్యంగా అనిపిస్తుంది. శివగంగై జిల్లాలోని సలుగైపురం ఊరి(Salugaipuram village)లో సంక్రాంతి పండగ ఉత్సవాలను విభిన్న పద్దతిలో నిర్వహిస్తారు.
ఇక్కడ ఓ వర్గం జనానికి ప్రత్యేకమైన కులదేవతలుగా ఉంటున్నారు. వారే పచ్చైనాచ్చి బిటారి, పొన్నళగిరి అమ్మవార్లు. ఇక్కడి స్త్రీలు అందరూ కనుమ రోజు నగలు ఏవీ ధరించరు. చేతులకు వేసుకున్న గాజులు, కాళ్లకు మెట్టెలు తీసేస్తారు. ఆ తర్వాత తెల్ల చీర కట్టుకుని..కుండ నెత్తిన పెట్టుకుని తమ కులదైవాల ఆలయానికి వెళ్తారు. అక్కడ పొంగళ్లు ఉంచుతారు. ఇలా చేయడంలో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు. దేవతల ముందు పేద, ధనిక తేడా ఉండదని..అందరూ సమానమే అని చెప్పడేమే ఆ ఆచారం ఉద్దేశమని చెబుతున్నారు.
అమ్మవార్ల ఆలయాల ముందు చెరకుతో ఊయల కడతారు.అందులో నిమ్మకాయలు ఉంచి మొక్కులు చెల్లిస్తారు. పూజలు పూర్తయిన అనంతరం ఆ నిమ్మకాయలను అక్కడే వేలం వేస్తారు. మన దగ్గర గణపతి లడ్డూ ఎలా వేస్తామో అక్కడ ఆ నిమ్మకాయలు వేలం వేస్తారు. వేలం వేసిన నిమ్మకాయలు దక్కితే కోరిన కోరికలు తీరుతాయని అక్కడి వారి నమ్మకం. అలా నిర్వహించే వేలంలో ఒక్క నిమ్మకాయ దాదాపు రూ. 40వేలు పలుకుతుంది. అదే విధంగా చెరుకుగడ ఒక్కటి రూ. 16వేలపైనే పలుకుతుందట.
ఈ ఆచారం సేలం జిల్లాలోని నత్తకరై(Natthakarai in Salem district) అనే గ్రామంలో 300 ఏళ్ల పురాతన ఆలయం నల్లసేవన్(Nalla Sevan) ఉంది. అక్కడ ఐదేళ్లకోసారి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతుంటాయి. సంక్రాంతి పండగ రోజు గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన పెళ్లైన స్త్రీలు వితంతు వేషం వేసుకుంటారు. ఇలా సూర్యోదయానికి ముందే తమ కులదైవాలకు పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లిస్తారు.






