Sanjay singh: ట్రంప్‌తో మోడీ టఫ్‌గా వ్యవహరించాలి.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

by B.Srinivas |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుతో ప్రధాని మోడీ కఠినంగా వ్యవహరించాలని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.

Sanjay singh: ట్రంప్‌తో మోడీ టఫ్‌గా వ్యవహరించాలి.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు (Donald Trump)తో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) కఠినంగా వ్యవహరించాలని, భారతీయ వలసదారులు అంశాన్ని ట్రంప్ వద్ద బలంగా లేవనెత్తాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay singh) తెలిపారు. ట్రంప్ జెలెన్ స్కీ (Zelensky)ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రస్తావిస్తూ మోడీపై విమర్శలు గుప్పించారు. ‘ట్రంప్ జెలెన్ స్కీల మధ్య వాగ్వాదం తర్వాత ట్రంప్ బెదిరింపులకు గురిచేస్తున్నారని స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం. స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం. కాబట్టి మోడీ సైతం ట్రంపుతో టఫ్‌గా వ్యవహరించాలి. వలసదారులను సంకెళ్లతో స్వదేశానికి పంపిన అంశంపై నిలదీయాలి’ అని పేర్కొన్నారు.

ట్రంప్‌కు తొత్తుగా మారే బదులు, నేరస్థుల మాదిరిగా సంకెళ్లతో భారతీయులను దేశానికి తీసుకువచ్చే అంశాన్ని మోడీ బలంగా లేవనెత్తాలని తెలిపారు. కాగా, ఈ నెల ప్రారంభంలో అమెరికా అక్రమ భారతీయ వలసదారులను కాళ్లకు గొలుసులు వేసి, చేతులకు సంకెళ్లు వేసి బహిష్కరిస్తున్న అంశం పార్లమెంటులో దుమారం రేపిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా ట్రంప్, జెలెన్ స్కీ ల మధ్య సమావేశంలో ఇరు దేశాధినేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే పై అంశాలను ప్రస్తావిస్తూ సంజయ్ సింగ్ మోడీపై ఫైర్ అయ్యారు.

Next Story