Sanjay Raut: ఉద్ధవ్ థాక్రే షిండేను సీఎం చేయాలనుకున్నారు.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

2019 ఎన్నికల తర్వాత ఉద్ధవ్ థాక్రే ఏక్‌నాథ్ షిండేను మహారాష్ట్ర సీఎంగా చేయాలని కోరుకున్నారని వ్యాఖ్యానించారు.

Sanjay Raut: ఉద్ధవ్ థాక్రే షిండేను సీఎం చేయాలనుకున్నారు.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల తర్వాత ఉద్ధవ్ థాక్రే (Udhav thakraey) ఏక్‌నాథ్ షిండే (Eknath shinde) ను మహారాష్ట్ర సీఎంగా చేయాలని కోరుకున్నారని వ్యాఖ్యానించారు. అయితే మొదట బీజేపీ, ఆ తర్వాత శరద్ పవార్‌తో సహా మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మిత్ర పక్షాలు ఆయనను ముఖ్యమంత్రిగా చేయడానికి అనుమతించలేదన్నారు. బుధవారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంవీఏ నేతలు వ్యతిరేకించకపోతే షిండే సీఎం అయ్యేవారని తెలిపారు.

షిండే సీఎం కావాలని ఆశించారని కానీ ఆయన తమ కంటే జూనియర్ కావడంతో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad pawar), ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajith pawar) లు నిరాకరించారని, షిండే కింద పని చేసేందుకు వారు ఆసక్తి చూపలేదని తెలిపారు. అందుకే తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పదవిని శివసేనతో పంచుకుంటామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని, అందుకే షిండేకు ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం రాలేదని ఆరోపించారు. కాగా, శివసేన, బీజేపీ మధ్య విభేదాలు నెలకొన్నాయని కథనాలు వెలువడుతున్న వేళ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story