- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 19 వరకు Sanjay Raut జ్యుడిషియల్ కస్టడీ పొడగింపు
ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విషయంలో ముంబై స్పెషల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

X
ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విషయంలో ముంబై స్పెషల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19 వరకు సంజయ్ రౌత్‌కు సోమవారం జ్యుడిషియల్ కస్టడీ పొడగించింది. సంజయ్ రౌత్ ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదని ఆయన తరపు న్యాయవాది సోమవారం కోర్టుకు తెలిపారు. అయితే శివసేన ఎంపీ కొన్ని పార్లమెంట్ ఫాంలపై సంతకం చేయడానికి, దాని కాపీని కోర్టుకు, ఈడీకి అందించడానికి కోర్టు అనుమతించింది. విచారణ సందర్భంగా కుటుంబసభ్యులతో పాటు అనేక మంది మద్దతుదారులు కోర్టుకు చేరుకున్నారు. పాత్ర చౌల్ భూ స్కాంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడని గత నెల 1న ఆరు గంటల విచారణ తర్వాత సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Next Story






