- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ధరలు ఫిక్స్.. అదిరిపోయే ప్రీ-ఆర్డర్ ఆఫర్లు!
స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ తన సరికొత్త ఎస్26 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్ దిగ్గజం శాంసంగ్ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ 'గెలాక్సీ S26' (Samsung Galaxy S26) సీరిస్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S26 అల్ట్రా (S26 Ultra) తో పాటు S26, S26 ప్లస్, మూడు మోడల్స్ రిలీజ్ చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన గెలాక్సీ అన్‍ప్యాక్ట్ 2026 ఈవెంట్‍లో వీటిని లాంచ్ చేసింది. భారత్‍లోని స్మార్ట్ ఫోన్ ప్రియులకు సైతం ఈ ఫోన్‍లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ల కొనసాగుతుండగా ఈ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. అప్‌డేటెడ్ గెలాక్సీ AI ఫీచర్లతో పాటుశక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా..?
ధరల వివరాలు:
గెలాక్సీ S26: దీని ప్రారంభ ధర రూ. 87,999 (12GB+256GB వేరియంట్).
గెలాక్సీ S26+: దీని ప్రారంభ ధర రూ. 1,19,999 (12GB+256GB వేరియంట్).
గెలాక్సీ S26 ఆల్ట్రా: దీని బేస్ మోడల్ ధర రూ. 1,39,999 కాగా, టాప్ ఎండ్ వేరియంట్ (16GB+1TB) ధర రూ. 1,89,999 గా నిర్ణయించారు.
భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు:
పరిమిత కాలం పాటు 256 GB మోడల్ ధరకు 512GB వేరియంట్‌ను సొంతం చేసుకునే ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఫిబ్రవరి 25 నుంచి ప్రీ-బుకింగ్స్ (Samsung Pre-order Benefits) ప్రారంభం కాగా మార్చి 6 నుండి వినియోగదారులకు డెలివరీలు అందనున్నాయి. ప్రీ-రిజర్వ్ వోచర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, గెలాక్సీ బడ్స్‌పై ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో అందించనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. వీటిని శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లతో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.






