- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరీ
నితీశ్ కుమార్ రాజీనామాతో బిహార్ నెక్స్ట్ సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నితీశ్ కుమార్ రాజీనామాతో బిహార్ నెక్స్ట్ సీఎం ఎవరు అనే సస్పెన్స్ కు తెరపడింది. బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పేరు అధికారికంగా ఖరారైంది. రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో బీజేపీ నుంచి బిహార్ కు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతున్న తొలి నేతగా సామ్రాట్ రికార్డు సృష్టించబోతున్నారు. 21 ఏళ్లు బిహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 57 ఏళ్ల సామ్రాట్ చౌదరి ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీహార్‌లోని కీలక సామాజిక వర్గమైన కుష్వాహా (కోయిరీ) ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి. రాష్ట్రంలో యాదవుల తర్వాత అతిపెద్ద వెనుకబడిన వర్గంగా ఉన్న కుష్వాహాల నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని జేడీయూ (JD-U) కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై కొత్త ప్రభుత్వం బీహార్ అభివృద్ధి పనులను చూసుకుంటుంది. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.






