- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షారుఖ్ తనయుడిపై కేసు వేసినందుకు.. పాక్ నుంచి బెదిరింపులు!
షారుఖ్ తనయుడిపై కేసు వేసినందుకు పాక్ నుంచి బెదిరింపులు వస్తున్నాయని సమీర్ వాంఖడే ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్’ చిత్రంపై కేసు వేసినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని నార్కొటిక్స్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి పాక్, యూఏఈ వంటి విదేశాల నుంచి కూడా బబెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు. చిత్రంలో తనను పోలిన పాత్రను చూపించి అవమానించారని, జాతీయ సిద్ధాంతమైన ‘సత్యమేవ జయతే’ను కూడా కించపరిచారని సమీర్ ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసు కూడా వేశారు.
గతంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను సమీర్ అరెస్టు చేశారు. ఈ కారణంగానే అతని పాత్రను చిత్రంలో ఆర్యన్ అలా చూపించారని ఆరోపణలున్నాయి. అయితే ఈ పోరాటంలో ఎంత దూరం వెళ్లేందుకైనా తాను సిద్ధమన్న సమీర్.. పోలీసులను, సత్యమేవ జయతే నినాదాన్ని అవమానించడంతోనే తాను కేసు వేశానన్నారు. తనకు, తన కుటుంబానికి పలుదేశాల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, వీటిని చూసి తను భయపడేది లేదని స్పష్టంచేశారు.






