- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sambhal: హోలీకి ముందు సంభాల్ జామా మసీదు చుట్టూ టార్పాలిన్ కప్పిన అధికారులు
హోలీ శాంతియుతంగా జరిగేలా చూస్తామని సంభాల్ ఎస్‌డీఎం డాక్టర్ వందన మిశ్రా తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ అధికారులు హోలీ, రంజాన్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బుధవారం జామా మసీదు చుట్టూ టార్పాలిన్ షీట్లను కప్పారు. రంజాన్ మాసం రోజే హోలీ కూడా ఉండటంతో పండుగ సమయంలో మసీదులపై రంగులు పడకుండా పీస్ కమిటీలతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. హోలీ సందర్భంగా ఊరేగింపు జరిగే పది సంప్రదాయ మార్గాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని సంభాల్ ఏఎస్పీ శ్రీష్ చంద్ర స్పష్టం చేశారు. విస్తృతమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్టు తెలిపారు. హోలీ శాంతియుతంగా జరిగేలా చూస్తామని సంభాల్ ఎస్‌డీఎం డాక్టర్ వందన మిశ్రా తెలిపారు. గతేడాది జామా మసీదును సర్వే చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేయడం, దానికోసం అధికారులు వెళ్లిన సమయంలో హింస జరగడం, కొందరు ప్రాణాలను కోల్పోయిన కారణంగా అధికార యంత్రాంగం మరోసారి ఎలాంటి ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు చేపడుతోంది. శుక్రవారం రోజున 16 హోలీ జాతరలు జరగనున్నాయి. అన్ని ప్రాంతాలు, గ్రామాల్లో శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించాం, జిల్లా స్థాయిలో రెండు కమిటీ సమావేశాలు జరిపినట్టు సంభాల్ డీఎం రాజేంద్ర పెన్సియా వివరించారు. నగరంలోని ఆరు జోన్లలో అధికారులు శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి, పోలీసు అధికారులు, న్యాయాధికారులను కూడా మోహరించారు. 27 క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. 29 పోలీసు సెక్టార్‌లుగా విభజించి అన్ని చోట్ల పోలీసు అధికారులను, మెజిస్ట్రేట్లను నియమించాం. కీలక ప్రాంతాల్లో మెజిస్ట్రేట్‌లను పెట్రోలింగ్ చేయమని కోరాం. 100-150 అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు రాజేంద్ర పెన్సియా పేర్కొన్నారు.






