ఐ-పాక్‌కు సమాజ్‌వాదీ పార్టీ షాక్: 2027 యూపీ ఎన్నికల ఒప్పందం రద్దు!

by Kema Shiva Kumar |

2027 యూపీ ఎన్నికల వ్యూహరచన నుంచి ఐ-పాక్ (I-PAC) సంస్థను సమాజ్‌వాదీ పార్టీ తప్పించింది.

ఐ-పాక్‌కు సమాజ్‌వాదీ పార్టీ షాక్: 2027 యూపీ ఎన్నికల ఒప్పందం రద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2027 ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐ-పాక్ (I-PAC) సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అనూహ్యంగా రద్దు చేసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, సంస్థలో చోటుచేసుకున్న పరిణామాలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఐ-పాక్ వ్యూహరచన చేసిన అధికార పార్టీలు (TMC, DMK) ఓటమి పాలవ్వడం ఈ నిర్ణయంపై ప్రభావం చూపింది.

ఇక ఐ-పాక్ డైరెక్టర్ వినేష్ చందేల్‌ను ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేయడం సంస్థకు ఇబ్బందిగా పరిణమించింది. బయటి ఏజెన్సీల కంటే క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తల పనితీరుపైనే అఖిలేష్ యాదవ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఆయన నిర్ణయంతో ఉత్తరప్రదేశ్‌లో ఐ-పాక్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్యాలయాలను మూసివేయడంతో పాటు సుమారు 30 నుంచి 40 మంది ఉద్యోగులను కూడా తొలగించినట్లుగా తెలుస్తోంది.

Next Story